ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని సహిబాబాద్ లో గల ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పన్నెండుమంది మృత్యువాత పడ్డారు.
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని సాహిబాబాద్ లో గల ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పన్నెండుమంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. చాలామంది ఈ సమయంలో నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే మొత్తం 14 అగ్ని మాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు నివారించేందుకు చర్యలు ప్రారంభించాయి. అత్యవసర సహాయ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గలకారణాలు తెలియాల్సి ఉంది.