ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అగ్నికి ఆహుతి అయ్యారు. మృతులలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు కథనం ప్రకారం... ఘజియాబాద్ జిల్లా షాహిబబాద్లోని బోప్రా ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణ గోడౌన్లో ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి.
ఆ ఘటనలో గోడౌన్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మహిళతోపాటు నెలల పసికందు ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్నారు. అగ్ని ప్రమాదంపై గత అర్థరాత్రి ఫిర్యాదు అందిందని, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పినట్లు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే గోడౌన్లో వస్త్ర దుకాణ గోడౌన్లో వంట సామాగ్రి వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.