సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఈ నెల 12న దొంగతనానికి గురైన ఆయన వ్యాగన్ ఆర్ కారును శనివారం ఘజియాబాద్‌లో పోలీసులు గుర్తించారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఇమేజ్‌కు ప్రతీకగా నిలిచిన ఈ కారును ఎవరు దొంగలించారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. కానీ, ఘజియాబాద్ ప్రాంతంలో ఈ కారును వదిలేసి వెళ్లినట్టు తాజాగా గుర్తించారు.
2015 అసెంబ్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ ఈ నీలిరంగు కారును ఉపయోగించారు. ఆయన సీఎం కావడంతో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేత వందన సింగ్ ఈ కారును ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద పార్క్ చేసి ఉన్నప్పుడు ఈ కారును దొంగలించినట్టు తెలుస్తోంది. ఈ వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేజ్రీవాల్ కారు దొంగతనంపై మీడియలో కథనాలు రావడం, సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఈ కారును వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment