నగరంలో మంగళవారం ఓ యువకుడిని అరెస్టుచేసిన పోలీసులు అతని వద్దనుంచి 545 మొబైల్ సిమ్ కార్డులు,
ఘజియాబాద్: నగరంలో మంగళవారం ఓ యువకుడిని అరెస్టుచేసిన పోలీసులు అతని వద్దనుంచి 545 మొబైల్ సిమ్ కార్డులు, ఓ ల్యాప్‌టాప్, రెండు ఎల్‌ఈడీలు, 25 మోడెమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సదరు యువకుడిని ఢిల్లీలోని ముఖర్జీనగర్ ప్రాంత నివాసి చిరాగ్ సప్రాగా గుర్తించారు. చిరాగ్‌ను నగరంలోని మురద్‌నగర్ ప్రాంతంలోగల రాధేశ్యామ్ అపార్ట్‌మెంట్‌లో అరెస్టు చేశారు. కాగా నగరంలోని కిరాయిదారుల వివరాలను సేకరిస్తుండగా చిరాగ్ తమకు దొరికిపోయాడని స్టేషన్ హౌజ్ అధికారి సుబోధ్ సక్సేనా తెలిపారు.
తాము తలుపులు తట్టగానే చిరాగ్ పారిపోయేందుకు యత్నించాడని, అయితే తప్పించుకోలేకపోయాడన్నారు. తాము వెళ్లే సమయానికి అతను కంప్యూటర్‌లో ఏదో పని చేసుకుంటున్నాడన్నారు. నిందితుడిని విచారించగా ఈ సిమ్‌లను తన తండ్రి కొనుగోలు చేశాడని, రియల్ ఎస్టేట్ సంస్థల తరఫున ఎస్‌ఎంఎస్‌లను పంపుకునేందుకు వాటిని వినియోగిస్తానంటూ తమకు తెలియజేశాడన్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతని తండ్రి రాజీవ్ సప్రా కోసం గాలిస్తున్నామని తెలిపారు.