
ప్రతీకాత్మక చిత్రం
ఘజియాబాద్ : ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ యువతి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు.. అతనికి అప్పటికే పెళ్లైందని పేర్కొన్నారు. న్యాయ విద్యార్థి అయిన యువతికి ట్యూషన్ క్లాస్‌లో నిందితుడు పరిచమయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అయితే వీరి వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. దీంతో అతను నాలుగు నెలల క్రితమే మరొక యువతిని పేళ్లి చేసుకున్నాడు.
అయినా తన ప్రియురాలితో సంబంధం కొనసాగించడానికి అతను ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు ఆదివారం సదరు యువతి ఇంటికెళ్లి మాట్లాడుతూ.. ఆకస్మాత్తుగా స్క్రూడ్రైవర్, కత్తితో దారుణంగా పొడిచాడు. యువతి కేకలు విన్న ఆమె తల్లి అక్కడికి వచ్చేసరికి నిందితుడు కూడా కత్తితో గొంతుకోసుకుని రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చిన ఆమె.. ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు.