
ప్రతీకాత్మక చిత్రం
తన ముగ్గురి పిల్లలకు విషం తాగించి.. అది బయటకు రాకుండా వారి నోటికి టేప్
లక్నో : అనుమానం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త తన భార్య పిల్లలను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్,ఘజియాబాద్‌లోని షాత్బాది నగర్‌లో గురువారం చోటుచేసుకుంది.
విషం తాగించి టేప్ వేసి..
స్థానికంగా నివాసం ఉంటున్న ప్రదీప్ (37)కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ గురువారం ఫుల్‌గా మధ్యం సేవించి ఇంటికొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. తాగిన మైకంలో ప్రదీప్ తొలుత భార్యను చంపాడు. అనంతరం తన ముగ్గురి పిల్లలకు విషం తాగించి.. అది బయటకు రాకుండా వారి నోటికి టేప్ వేసాడు. తర్వాత భార్య వివాహేతర సంబంధంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాము సంఘటనాస్థలికి చేరుకునే సరికి ప్రదీప్ భార్య, ముగ్గురు పిల్లల్లో ఒకరు కొనఊపిరితో ఉన్నారని వారిని ఆసుపత్రికి తరలించే లోపే మరణించారన్నారు.