నగరంలో నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండ్రోజులుగా ‘ఆపరేషన్ స్మార్ట్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ నేరాలు
ఘజియాబాద్ : నగరంలో నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండ్రోజులుగా ‘ఆపరేషన్ స్మార్ట్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న 435 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా పోలీస్ అధికారి ధర్మేంద్ర యాదవ్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు.. వివిధ కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నేరగాళ్లను అరెస్టు చేయాలని ఈ నెల 1వ తేదీన న్యాయాధికారులు సూచించారని చెప్పారు. ఈ మేరకు నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరాపురం పోలీసులు అత్యధికంగా 72 మంది నేరగాళ్లను అరెస్టు చేశారని చెప్పారు. లోని ప్రాంతంలో 70 మంది, షాహిబాబాద్ పరిధిలో 58 మంది, విజయనగర్ పరిధిలో 57 మందితోపాటు ఇంకా పలుచోట్ల మరికొందరు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.