బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. రమేష్ తురానీ దర్శకుడు. మెయిన్ హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. మరో హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నారనే టాక్ బాలీవుడ్‌లో వినిపించింది. కానీ శ్రీలీల ప్లేస్‌లో పూజా హెగ్డే నటించనున్నారనే టాక్ బీటౌన్‌లో తెరపైకి వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)
ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్‌కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని బాలీవుడ్ భోగట్టా. దాంతో పూజా హెగ్డే ఎంట్రీ అయ్యారట. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment