Varun Dhawan Promises Help To Fan Facing Alleged Domestic Abuse By Her Father - Sakshi
Sakshi News home page

Varun Dhawan: నాన్న టార్చర్‌ పెడుతున్నాడు.. అభిమాని కష్టాలకు చలించిపోయిన హీరో

Jun 8 2022 5:02 PM | Updated on Jun 8 2022 6:28 PM

Varun Dhawan Promises Help To Fan Facing Alleged Domestic Abuse By Her Father - Sakshi

మా నాన్న నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. నన్నే కాదు మా అమ్మను కూడా నిత్యం వేధిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి కనీసం తిండి కూడా పెట్టట్లేదు. పైగా పచ్చిబూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ మమ్మల్ని టార్చర్‌ పెడుతున్నాడు'.

బాధగా అనిపిస్తే అయినవాళ్లతో చెప్పుకుంటాం. కష్టాలొస్తే కన్నవాళ్లతో చెప్పుకుంటాం. కానీ కన్నతండ్రే హింసిస్తూ బాధపెడుతుంటే? ఓ అమ్మాయికి ఇలాంటి కష్టమే వచ్చింది. తండ్రి తనను, తన తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని సోషల్‌ మీడియాలో వాపోయింది. 'మా నాన్న నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. నన్నే కాదు మా అమ్మను కూడా నిత్యం వేధిస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాక నిత్యం తాగొచ్చి మమ్మల్ని హింసిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి కనీసం తిండి కూడా తిననివ్వట్లేదు. పైగా పచ్చిబూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ మమ్మల్ని టార్చర్‌ పెడుతున్నాడు'.

'స్థానిక పోలీసులు సాయం చేస్తారన్న ఆశ పోయింది. వుమెన్‌ హెల్ప్‌లైన్‌ కూడా చేతులెత్తేసింది. దయచేసి మీరే ఏదైనా చేయండి' అంటూ హీరో వరుణ్‌ ధావన్‌ను, గుజరాత్‌ పోలీసులను వేడుకుంది. ఈ ట్వీట్‌పై వరుణ్‌ ధావన్‌ స్పందిస్తూ.. 'ఇది చాలా సీరియస్‌ విషయం. ఒకవేళ ఇది నిజమే అయితే పై అధికారులతో మాట్లాడి తప్పకుండా నీకు సాయం చేస్తాను' అని రాసుకొచ్చాడు. కాగా వరుణ్‌ చివరిసారిగా కూలీ నెంబర్‌1 మూవీలో కనిపించాడు. అతడు హీరోగా నటించిన తాజా చిత్రం జగ్‌ జగ్‌ జియో ఈ నెల 24న విడుదల కానుంది.

చదవండి: సూర్య ఎంట్రీ సీన్‌.. స్క్రీన్‌ తగలబెట్టిన ఫ్యాన్స్‌!
తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement