బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం భేదియా. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 25న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు వరుణ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి వల్ల బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు తెలిపాడు.
ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేక కఠిన పరిస్థితుల్లోనూ తనను తాను పుష్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. 'ఈ భూమిపై మనం రన్నింగ్ రేస్‌లో పాల్గొంటున్నాం. ఈ పరుగు ఎందుకని ఎవరూ అడగరు. కానీ మనం ఇలా పరిగెత్తుతున్నందుకు ఏదో ఒక గొప్ప కారణం ఉండే ఉంటుంది. నన్ను నేను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నా, అలాగే ఇతరులు కూడా వారిని వారు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు.
కాగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధి. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడంతో మెదడుకు సందేశాలు అందడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉంది. కొందరిలో తల ఒకవైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. దీనిబారినడ్డవారు బ్యాలెన్స్ అదుపుతప్పి ఆకస్మాత్తుగా పడిపోయే ఛాన్స్ ఉంది.
చదవండి: బాలాదిత్య అన్న ఒక్కమాటతో గుండె పగిలింది: గీతూ
ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త
Comments
Please login to add a commentAdd a comment