Vestibular system
-
అరుదైన వ్యాధితో పోరాడుతున్న యంగ్ హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం భేదియా. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 25న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు వరుణ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి వల్ల బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు తెలిపాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేక కఠిన పరిస్థితుల్లోనూ తనను తాను పుష్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. 'ఈ భూమిపై మనం రన్నింగ్ రేస్‌లో పాల్గొంటున్నాం. ఈ పరుగు ఎందుకని ఎవరూ అడగరు. కానీ మనం ఇలా పరిగెత్తుతున్నందుకు ఏదో ఒక గొప్ప కారణం ఉండే ఉంటుంది. నన్ను నేను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నా, అలాగే ఇతరులు కూడా వారిని వారు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధి. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడంతో మెదడుకు సందేశాలు అందడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉంది. కొందరిలో తల ఒకవైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. దీనిబారినడ్డవారు బ్యాలెన్స్ అదుపుతప్పి ఆకస్మాత్తుగా పడిపోయే ఛాన్స్ ఉంది. చదవండి: బాలాదిత్య అన్న ఒక్కమాటతో గుండె పగిలింది: గీతూ ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త -
నిల్చుంటే బ్యాలెన్స్ తప్పుతోంది...
ఇఎన్‌టి కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, కోదాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నాకు నత్తి వస్తోంది. త్వరత్వరగా మాట్లాడినప్పుడు నత్తి ఎక్కువవుతోంది. దాంతో ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియజేయగలరు. - వి. రమేశ్, జనగామ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మీరు మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. ఇలా నత్తిని అధిగమించినవారు చాలామందే ఉన్నారు. మీ అంతట మీరు సమస్యనుంచి బయటపడలేకపోతే స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. -
వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే!
లోపలి చెవి నుంచి మెదడుకు అనుసంధానంగా ఉండే వెస్టిబ్యూలార్ సిస్టమ్‌లో తేడా వస్తే తల దిమ్ముగా ఉండడం, తల తిరిగినట్లయి పడిపోవడం జరుగుతుంది. దేహం కదలికలకు అనుగుణంగా తలలో వెస్టిబ్యూలార్ వ్యవస్థ స్పందిస్తూ ఉంటుంది. అందులో తేడా వస్తే రొటేషన్ మోషన్ క్రమం తప్పుతుంది. దీనిని ‘వర్టిగో’ అంటారు. ఉన్నట్లుండి కళ్ల ముందు వలయాకారంగా తిరుగుతున్నట్లు అనిపించడం, వాంతి వచ్చినట్లు ఉండడం, వాహనం నడవలేకపోవడం, చూపు మసకబారడం (బ్లర్డ్ విజన్), చెవులు వినిపించకపోవడం, చెవిలో హోరు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఏంచేయాలంటే... ఉన్న చోటనే కూర్చోవాలి. వీలయితే పడుకోవాలి. దగ్గర ఉన్న వారిని సహాయానికి పిలవాలి. వాహనం నడుపుతుంటే వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు తీసుకుని ఆపేయాలి. దుస్తులు వదులు చేసుకుని దేహానికి బాగా గాలి తగలనివ్వాలి. లైట్లు తీసేసి సాధారణ వెలుతురు ఉండేలా చూడాలి లేదా గదిని చీకటిగా ఉంచాలి. దాహంగా ఉంటే నీరు తాగాలి. తేరుకున్న తర్వాత డాక్టర్‌ను సంప్రదించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి. వర్టిగో పేషెంట్లు పూర్తిగా కోలుకునే వరకు ఒంటరిగా బయటకు వెళ్లరాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరో వ్యక్తి సహాయంగా కనిపెట్టుకునే ఉండాలి. బాత్రూములోకి వెళ్లినప్పుడు తలుపు గడియ పెట్టుకోకపోవడమే మంచిది.