
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.
శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్‌తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment