
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట.
ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఉమైర్‌సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు.
Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX
— Umair Sandhu (@UmairSandu) May 24, 2023