
వరుణ్ ధావన్
‘బద్లాపూర్’ వచ్చిన నాలుగేళ్లకు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్, హీరో వరుణ్ ధావన్ ఓ సినిమా కోసం కలసి పని చేయనున్నారు. 1971 ఇండియా–పాక్ యుద్ధంలో మరణించిన సెకండ్ ల్యూటినెంట్ అరుణ్ కేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అరుణ్ కేత్రపాల్ ధైర్యానికి పరమవీర చక్రను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ‘‘సైనికుడి పాత్రలో నటించాలన్నది నా కల. ఈ సినిమాతో అది నెరవేరబోతోంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. శ్రీరామ్ రాఘవన్‌గారితో మరోసారి పనిచేయడం చాలా సంతోషం’’ అని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment