Samantha And Varun Dhawan Teaming Up For Citadel India Version Web Series, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha - Varun Dhawan: అందుకే సమంత, వరుణ్‌ ధావన్‌ కలుసుకున్నారు..

Published Mon, Mar 14 2022 8:43 AM | Last Updated on Mon, Mar 14 2022 1:34 PM

Samantha And Varun Dhawan Teaming Up For A Web Series - Sakshi

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ తర్వాత సమంత క్రేజ్‌ బాలీవుడ్‌లోనూ బాగా పెరిగింది. అయితే ఆ వెబ్‌సిరీస్‌ తర్వాత ఇప్పటి వరకు సమంత మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి అధికారికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’తీసిన రాజ్‌ అండ్‌ డీకే ద్వయం రూపొందించనున్న మరో వెబ్‌ సిరీస్‌లో సమంత భాగం కానున్నారని, ఈ ప్రాజెక్ట్‌లో వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.

చదవండి: షాకింగ్‌.. నయన్‌, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్‌

అయితే ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయిందని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. వరుణ్‌ ధావన్, సమంత కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు, వర్క్‌ షాప్స్‌లో భాగంగానే సమంత, వరుణ్‌ కలుసుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈ ప్రాజెక్ట్‌ కోసం సమంత స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement