List of Bollywood Upcoming Web Series in 2023 - Sakshi
Sakshi News home page

Up Coming Web Series: హాలీవుడ్‌ వెబ్‌... బాలీవుడ్‌ హబ్‌!

Published Wed, Feb 1 2023 8:42 AM | Last Updated on Wed, Feb 1 2023 10:19 AM

Here Is List Of Bollywood Upcoming Web Series - Sakshi

హాలీవుడ్‌ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ కావడం కొత్తేం కాదు. అయితే కరోనా తర్వాత మొదలైన వెబ్‌ సిరీస్‌ల హవా వల్ల ఇప్పుడు బాలీవుడ్‌ హబ్‌గా పలు హాలీవుడ్‌ సిరీస్‌లు కూడా రీమేక్‌ అవుతున్నాయి. విదేశీ కథలతో దేశీ తారలు చేస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం. 

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీపై త్వరలో ఓ స్పష్టత వస్తుంది. నేర ప్రపంచంలో సెటిల్మెంట్స్‌ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు ఓ వ్యక్తి. అయితే అతని తండ్రి విడుదలైన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ తండ్రీ కొడుకుల కథ ఏంటి? అన్నదే ‘రానా నాయుడు’ ప్రధాన కథాంశం.

2013లో మొదలైన ‘రే డొనవన్‌’ సిరీస్‌ ఏడుసీజన్లుగా 19 జనవరి 2020 వరకూ సాగింది. మరోవైపు నైట్‌ మేనేజర్‌గా వెబ్‌ వీక్షకుల ముందుకు వస్తున్నారు యువ హీరో ఆదిత్యారాయ్‌ కపూర్‌. అనిల్‌ కపూర్, శోభితా ధూళ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు సందీప్‌ మోది దర్శకుడు. బ్రిటిష్‌ క్రైమ్‌ డ్రామా ‘ది నైట్‌ మేనేజర్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెలలో స్ట్రీమింగ్‌ కానుంది. ఓ స్టార్‌ హోటల్‌లో పని చేసే ఓ నైట్‌ మేనేజర్‌ అదే హోటల్‌కు గెస్ట్‌గా వచ్చిన ఓ యువతిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా అతను ఆయుధాలను అక్రమ రవాణా చేసే ఓ ముఠా నాయకుడి చేతిలో చిక్కుకుంటాడు.

అప్పుడు ఆ నైట్‌ మేనేజర్‌ ఏం చేశాడు? అన్నదే కథ. ఇక అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా ‘రివెంజ్‌’ సిరీస్‌ హిందీలో రీమేక్‌ కానుంది. ఇందులో లీడ్‌ రోల్‌ను రవీనా టాండన్‌ చేయనున్నారు. త్వరలో షూటింగ్‌ ఆరంభం కానుంది. ‘రివెంజ్‌’ కథ విషయానికి వస్తే... తన తండ్రి మరణానికి కారకులైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒక సాధారణ యువతి ఏ విధంగా పగ తీర్చుకుంది? అన్నదే కథాంశం. ఇంకోవైపు మరో అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా ‘సిటా డెల్‌’ హిందీలో రీమేక్‌ అవుతోంది. హిట్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌’ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. 

ఇందులో వరుణ్‌ ధావన్, సమంత లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. దేశరక్షణ కోసం ఓ గూఢచారి ఎలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది? అనే నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. కాగా మరికొన్ని ఫారిన్‌ సిరీస్‌ లకు దేశీ వెర్షన్‌ రానుంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ప్రస్తుతం కొన్ని ఫారిన్‌ వెబ్‌ సిరీస్‌లు హిందీలో రీమేక్‌ అవుతుండగా ఆల్రెడీ కొన్ని సిరీస్‌లు ఇండియాలో రీమేక్‌ అయ్యాయి. జర్నలిజం నేపథ్యంలో రూపొందిన బ్రిటిష్‌ సిరీస్‌ ‘ప్రెస్‌’ హిందీ రీమేక్‌ ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’లో సోనాలీ బింద్రే ఓ లీడ్‌ రోల్‌ చేశారు.

ఇజ్రాయెల్‌ సిరీస్‌ ‘హోస్టేజెస్‌’ అదే పేరుతో హిందీలో రీమేక్‌ కాగా ఇందులో రోనిత్‌ రాయ్, టిస్కా చోప్రా లీడ్‌ రోల్స్‌ చేశారు. అలాగే బ్రిటిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘లూథర్‌’ హిందీ రీమేక్‌ ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’లో అజయ్‌ దేవగన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ఇదే కోవలో డచ్‌ (నెదర్లాండ్‌) డ్రామా సిరీస్‌ ‘పెనోజా’ ఆధారంగా ‘ఆర్య’ హిందీలో రాగా, ఇందులో సుష్మితా సేన్‌ ప్రధాన ΄ాత్రధారి. అలాగే అమెరికన్‌ సిరీస్‌లు ‘క్రిమినల్‌ జస్టిస్‌’ (మూడు సీజన్లు), ‘ది ఆఫీస్‌’(రెండు సీజన్లు) నెట్టింటి వీక్షకుల ముందుకు వచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement