
ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటం అంత వీజీ కాదంటున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా నటాశా దలాల్‌ను ప్రేమలో పడేశానని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడియో షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు.‘‘ నేను తనని మొట్టమొదటి సారి ఆరవ తరగతిలో చూశాను. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయినట్లుగా అనిపించింది. కానీ, మేము అప్పటినుంచి ప్రేమించుకోవటం లేదు. ( నర్స్ నం.1)
ఇంటర్ వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాము. ఆ తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది. కానీ, నేను నమ్మకాన్ని కోల్పోలేదు’’ అని అన్నాడు. వరుణ్ ధావన్ తాజా చిత్రం ‘కూలీ నెం.1’. తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయిక. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment