
ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు. కాగా, గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న వరుణ్ ధావన్ పెళ్లి ఆదివారం జరగనుంది. మరికొన్ని గంటల్లో ప్రియురాలు నటాషా దలాల్‌తో వరుణ్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. అలీభాగ్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాల వారు హోటల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment