బాలీవుడ్‌ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్‌! | Keerthy Suresh Hungama in Varun Dhawan Birthday Celebration | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: బాలీవుడ్‌ ఎంట్రీ.. కీర్తి చూశారా? అప్పుడే ఎలా మారిపోయిందో!

Published Fri, Apr 26 2024 12:03 PM | Last Updated on Fri, Apr 26 2024 12:07 PM

Keerthy Suresh Hungama in Varun Dhawan Birthday Celebration

ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్‌. కెరీర్‌ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను మెయింటెన్‌ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్‌ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్‌ చిత్రాల వరకూ గ్లామర్‌కు దూరంగానే ఉంటూ వచ్చారు.

బాలీవుడ్‌లో ఎంట్రీ
తెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్‌గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్‌కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్‌ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్‌లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.

వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే
బేబీజాన్‌ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్‌ అయిన తేరి చిత్రానికి రీమేక్‌. ఈ మూవీని తమిళ టాప్‌ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్‌ షూటింగ్‌ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్‌ 24) ఈ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చిత్ర యూనిట్‌ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్‌ డీప్‌ నెక్‌ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్‌ ధావన్‌కు కేక్‌ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 

 

చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement