'బేబీ జాన్‌' కోసం కీర్తి సురేశ్‌ గ్లామర్‌ డోస్‌.. పూర్తి సాంగ్‌ విడుదల | Keerthy Suresh And Varun Dhawan Baby John Movie Nain Matakka Song Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

'బేబీ జాన్‌' కోసం కీర్తి సురేశ్‌ గ్లామర్‌ డోస్‌.. పూర్తి సాంగ్‌ విడుదల

Published Mon, Nov 25 2024 1:12 PM | Last Updated on Mon, Nov 25 2024 1:18 PM

Keerthy Suresh And Varun Dhawan Baby John Song Out Now

వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్‌’. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్‌ సాంగ్‌ విడుదలైంది. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ సినిమా 'తెరి'కి రీమేక్‌గా బేబీ జాన్‌ రానుంది.  కీర్తీ సురేశ్‌, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్‌ యాపిల్‌ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్‌ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్‌ కానుంది.

బేబీ జాన్‌ నుంచి విడుదలైన తాజా సాంగ్‌లో కీర్తి సురేష్‌ కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్‌ రోల్స్‌ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్‌లాక్‌ సీన్‌లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడమేనని  నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement