బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్‌లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్‌లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment