Rashmika Mandanna Dance To Arabic Kuthu Song With Varun Dhawan, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'అరబిక్‌ కుతు' సాంగ్‌కు రష్మిక మందన్నా స్టెప్పులు.. వీడియో వైరల్‌

Published Fri, Mar 11 2022 12:24 PM | Last Updated on Fri, Mar 11 2022 12:52 PM

Rashmika Mandanna Dance To Arabic Kuthu Song With Varun Dhawan - Sakshi

Rashmika Mandanna Dance To Arabic Kuthu Song With Varun Dhawan: తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్‌'. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ నుంచి విడుదలైన 'అరబిక్‌ కుతు' సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌ టాప్‌ సాంగ్స్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాట ప్రస్తుతం 150 మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఈ తమిళ పాటకు ప్రముఖ హీరో శివ కార్తికేయన్ తమిళం, అరబిక్‌ పదాలతో లిరిక్స్‌ అందించారు. అయితే ఈ పాటకు నెటిజన్స్‌తోపాటు అనేక సెలబ్రిటీలు స్టెప్పులేశారు. 

చదవండి: సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న అరబిక్‌ కుతు సాంగ్‌

జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ఈ మాస్‌ స్టెప్స్‌ను ఇదివరకు సమంత, కీర్తి సురేష్‌ డ్యాన్స్‌ చేశారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ పాటకు మరో స్టార్‌ హీరోయిన్‌ వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఆమె ఎవరో కాదు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా బాలీవుడ్‌లోనూ మెలి మెల్లిగా బిజీ కాబోతోంది. ఇప్పటికే రెండు చిత్రాలు చేస్తున్న ఈ ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రీకరణలోనే వీరిద్దరూ కలిసి అరబిక్‌ కుతు సాంగ్‌పై స్టెప్పులేశారు. ఈ వీడియోను వరుణ్‌ ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement