హీరో ఇంటిని రెంట్‌కు తీసుకోనున్న స్టార్ జంట! | Varun Dhawan To Rent Hrithik Roshans RS 50 Crore Juhu House | Sakshi
Sakshi News home page

Varun Dhawan: స్టార్‌ హీరో ఇంటిని రెంట్‌కు తీసుకోనున్న వరుణ్ ధావన్!

Published Mon, Jun 10 2024 10:08 PM | Last Updated on Mon, Jun 10 2024 10:08 PM

Varun Dhawan To Rent Hrithik Roshans RS 50 Crore Juhu House

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్‌ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్‌ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ బాలీవుడ్‌లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.

ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్‌కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్‌కు షిఫ్ట్‌ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌కు మారిపోయారు.

దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్‌కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్‌  అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్‌లో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement