Samantha Training In Archery For Her Web Series - Sakshi
Sakshi News home page

'ది ఫ్యామిలీ మ్యాన్‌' తరహాలో..  మరోసారి డేర్‌ చేస్తున్న సామ్‌

Aug 25 2022 8:45 AM | Updated on Aug 25 2022 9:39 AM

Samantha Training In Archery For Her Web Series - Sakshi

యువతలో సమంత క్రేజ్‌ వేరు. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తరువాత, భర్త నుంచి విడిపోయిన తరువాత కూడా ఏమాత్రం జోరు తగ్గని నటి ఎవరైనా ఉన్నారంటే అది సమంతనే అవుతుంది. నటిగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ది ఫ్యామిలీ మెన్‌ – 2 హింది వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ రంగప్రవేశం చేయడంతో పాటు, ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు తనదైన శైలిలో విలనిజాన్ని ప్రదర్శంచడంతో పాటు గ్లామరస్‌గానూ నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. అయితే విమర్శలు వచ్చినా, నటిగా అంతకంటే మంచి పేరును ఈ వెబ్‌ సిరీస్‌ తెచ్చి పెట్టింది. దీంతో మరోసారి సంచలనం సృష్టించడానికి సమంత రెడీ అవుతోంది.

ది ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందించిన రాజ్, డీకే తాజాగా దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్న వెబ్‌ సిరీస్‌లో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం. రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిట్టాల్‌ అనే అమెరికా వెబ్‌ సిరీస్‌ను ఇండియన్‌ భాషల్లో రీమేక్‌ చేయనున్నారు. నటుడు వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్న ఇందులో యాక్షన్‌ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.

వీరికి అమెరికాకు చెందిన స్టంట్‌ మాస్టర్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుందని సమాచారం. చిత్రంలో మామూలు యాక్షన్‌ సన్నివేశాలు కాకుండా ఒళ్లు జలదరించే విధంగా చోటు చేసుకోవడంతో శిక్షణ కాలం అధికంగా ఉంటుందని తెలిసింది. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో శాకుంతలం, యశోద చిత్రాలు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు కావడం విశేషం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement