
వరుణ్ ధావన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
తాజాగా ‘బేబీ జాన్’ టెస్టర్ కట్ పేరుతో ఈ సినిమా కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బేబీ వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పొచ్చుగా..’, ‘నాలాంటివాళ్లు గతంలో చాలామంది వచ్చి ఉండొచ్చు.. కానీ నేను తొలిసారిగా ఇప్పుడే వచ్చాను’ వంటి డైలాగ్స్‌తో పాటు ‘హో.. బేబీజాన్’ సాంగ్ వీడియోలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment