
Varun Dhawan Met With Indian Women's Football Team: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును కలిసి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిశాడు. నాలుగు దేశాల(ఇండియా, బ్రెజిల్, చిలీ, వెనిజులా)తో ఆడనున్నటోర్నమెంట్‌లో శనివారం బ్రెజిల్‌లోని మనాస్‌కు వెళ్తుండగా విమానాశ్రయంలో వరుణ్ ధావన్ తారసపడ్డాడు. ఈ సందర్భంగా మహిళల ఫుట్‌బాల్ టీం, వరుణ్ ధావన్ కలిసి కెమెరాను క్లిక్‌మనిపించారు. ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ ర్యాంక్‌లో ఉన్న భారత మహిళ జట్టు, నవంబర్ 25న ఏడో ర్యాంక్‌లో ఉన్న బ్రెజిల్‌తో, నవంబర్ 28న చిలీ (37వ ర్యాంక్), డిసెంబర్ 1న వెనిజులా (56వ ర్యాంకు)తో తలపడనుంది.
ఇప్పటికే బ్రెజిల్‌కు కాన్ఫెడెరాకో బ్రెజిలీరా డి డిస్పోర్టోస్ (CBF) పేరుతో పూర్తి జట్టుగా మారింది. ఇందులో మార్టా డా సిల్వా, ఫార్మిగా మోటా వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. జనవరి 2022 నుంచి ముంబై, పూణెలలో జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్స్‌పోజర్ టూర్ ఉంది. ఇదిలా ఉంటే, తన రాబోయే చిత్రం ఫ్యామిలీ డ్రామా అయిన 'జగ్ జగ్ జీయో' విడుదల తేదిని శనివారం వరుణ్ ప్రకటించాడు. వరుణ్ ధావన్, కియారా అద్వాని, నీతూ కపూర్, అనిల్ కపూర్, మనీష్ పాల్, ప్రజక్తా కోలీ నటిస్తున్న ఈ చిత్రం జూన్ 24, 2022న థియేటర్లలోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment