కథానాయకిగా మంచి క్రేజ్‌లో ఉన్న నటి నటనకు విరామం ప్రకటించడం జరుగుతుందా..? అదీ పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అంటే అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈమె, అంతేవేగంగా ఇండియన్ కథానాయకిగా ఎదిగింది .
మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది.తను 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం 'మేరీ జాన్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది.
కాగా ప్రస్తుతం ఈ భామ కొత్త చిత్రాలు అంగీకరించడం లేదని ప్రచారం హోరెత్తుతోంది. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు, అందుకని నటనకు విరామం ఇవ్వనున్నట్లు.. తరువాత నటిగా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్‌కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవన్నది నిజం.
Comments
Please login to add a commentAdd a comment