మౌజీ.. మమతల కహానీ | Anushka Sharma and Varun Dhawan wrap up Sui Dhaaga | Sakshi
Sakshi News home page

మౌజీ.. మమతల కహానీ

Published Fri, Jul 6 2018 1:08 AM | Last Updated on Fri, Jul 6 2018 1:08 AM

 Anushka Sharma and Varun Dhawan wrap up Sui Dhaaga - Sakshi

వరుణ్‌ ధావన్‌, అనుష్కా శర్మ

ఇక్కడున్న ఫొటో చూశారుగా! అనుష్కా శర్మను వరుణ్‌ ధావన్‌ ఏదో విషయమై నిలదీస్తున్నట్లుగా ఉంది కదూ! మరి వరుణ్‌ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్‌ పడుతుంది. శరత్‌ కటారియా దర్శకత్వంలో వరుణ్‌ ధావన్, అనుష్కా శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘సూయిధాగా’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ‘మేడిన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో టైలర్‌ మౌజీ పాత్రలో వరుణ్, మమత పాత్రలో అనుష్క నటించారు. మరి.. మౌజీ, మమత దంపతుల కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 వరకు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement