సూదీ దారం తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తు్తన్నారు అనుష్క శర్మ. వీదేశీ ఉత్పత్తులు వద్దు.. స్వదేశీ ఉత్పత్తులే ముద్దు అంటున్నారు వరుణ్ ధావన్. అందుకే వరుణ్ దర్జీ అవతారం ఎత్తారు. ఇదంతా ‘సూయి ధాగా’ సినిమా కోసం. అంటే.. సూదీ దారం అని అర్థం. వరుణ్ టైలర్‌గా, అతని దగ్గర ఎంబ్రాయిడరీ వర్కర్‌గా అనుష్క శర్మ కనిపిస్తారట సినిమాలో. ఆ క్యారెక్టర్ కోసమే ఇలా సూదీ దారం తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుంటున్నారామె. ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘సూయి ధాగా’ సినిమాకు శరత్ కాత్రియ దర్శకత్వం వహిస్తున్నారు.
వరుణ్, అనుష్క ఫస్ట్ టైమ్ జోడీగా న టిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘గాంధీజీ నుంచి మోదీజీ వరకు పాటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ మంత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. మెసేజ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ «ధావన్. ‘‘కష్టాలతో నేసిన కథ.. నిర్బంధంగా అయినా ఈ కథ అందరికీ వినిపించాలి. గాంధీజీ పాటించిన స్వదేశీ మూమెంట్ (మేక్ ఇన్ ఇండియా) అనే పాయింట్‌తో పాటుగా ఓ అద్భుతమైన లవ్ స్టోరీ చెప్పదలుచుకున్నాము’’ అన్నారు అనుష్కశర్మ.
Comments
Please login to add a commentAdd a comment