సల్మాన్‌ ఇంకా చిన్నోడే.. | Salman Too Young To Have A Biopic Made On Him: Varun Dhawan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఇంకా చిన్నోడే..

Published Sun, Apr 8 2018 5:11 PM | Last Updated on Sun, Apr 8 2018 5:11 PM

Salman Too Young To Have A Biopic Made On Him: Varun Dhawan - Sakshi

సాక్షి, ముంబయి : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌పై బయోపిక్‌ గురించి హీరో వరుణ్‌ ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయోపిక్‌ తీసేంత వయసు ఆయనకు లేదని, సల్మాన్‌పై బయోపిక్‌ రూపొందించాల్సి వస్తే తన పాత్రలో ఆయనే నటించాలని జోక్‌ చేశారు. కృష్ణజింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో రెండు రాత్రులను గడిపిన అనంతరం శనివారం సల్మాన్‌కు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే.

సల్మాన్‌ సహా ఆయన కుటుంబ సభ్యులు చట్టాన్ని గౌరవిస్తారని, సల్మాన్‌కు బెయిల్‌ దొరకడంతో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సల్మాన్‌ కుటుంబానికి దేశ న్యాయవ్యవస్థపై అపార విశ్వాసం ఉందని తాను గతంలో ట్వీట్‌ చేశానని పేర్కొన్నారు. సల్మాన్‌ బెయిల్‌పై తిరిగి ఇంటికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని, సల్మాన్‌ను చూడటం సంతృప్తికరంగా ఉందని వరుణ్‌ ధావన్‌ చెప్పారు. సల్మాన్‌ బయోపిక్‌లో వరుణ్‌ ధావన్‌ను చూడాలని అందరూ భావిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ బయోపిక్‌ తీసేంత వయసు సల్మాన్‌కు లేదని వ్యాఖ్యానించారు. సల్మాన్‌ బయోపిక్‌ తెరకెక్కితే ఆ పాత్రలో ఆయనే నటించాలని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement