కలాంక్‌ ఫస్ట్‌ లుక్‌.. జాఫర్‌గా వరుణ్‌ | Varun Dhawan Look From Kalank Revealed | Sakshi
Sakshi News home page

కలాంక్‌ ఫస్ట్‌ లుక్‌.. జాఫర్‌గా వరుణ్‌

Published Thu, Mar 7 2019 11:59 AM | Last Updated on Thu, Mar 7 2019 12:52 PM

Varun Dhawan Look From Kalank Revealed - Sakshi

వరుణ్ ధావన్‌, అలియా భట్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్‌డ్రామా కలాంక్‌. కరణ్ జోహర్‌, సాజిద్ నదియావాలా, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్‌ వర్మన్‌ దర్శకుడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధురి దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ హీరో వరుణ్ ధావన్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరుణ్‌ భయంలేని ప్రేమికుడు జాఫర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement