వరుణ్ ధావన్, నటాషా దలాల్
జంటగా పార్టీలకు, ఫంక్షన్‌లకు వెళుతున్నారు కానీ తమ మధ్య ఉన్నది ప్రేమ అని మాత్రం ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్. ‘కాఫీ విత్ కరణ్’ అనే షోలో భాగంగా నటాషాను లవ్ చేస్తున్నట్లు వరుణ్ ఒప్పుకున్నారు. ‘‘నటాషాతో నేను డేటింగ్‌లో ఉన్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నటాషా సాధారణమైన అమ్మాయి. ఆమె గురించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు.
ఆమె బాధపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ఈ ఏడాది 31వ∙వసంతంలోకి అడుగు పెట్టిన వరుణ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’ సినిమాతో బిజీగా ఉన్నారాయన. సంజయ్‌దత్, మాధురీ దిక్షీత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment