ముంబై : కోవిడ్-19తో సినిమా షూటింగ్‌లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్నీషియన్లు. సిబ్బందికి బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో జీవనోపాథి కోల్పోయిన బాలీవుడ్ డ్యాన్సర్లకు అండగా నిలిచేందుకు స్టార్ హీరో వరుణ్ ధావన్ ముందుకొచ్చారు. గతంలో వరణ్ ధావన్ పీఎం కేర్స్‌ఫండ్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు అందచేశారు. సినీ పరిశ్రమలో పనిచేసే దినసరి వేతన కార్మికులనూ ఆదుకున్నారు.
సినిమాల్లో తనతో పనిచేసిన బాలీవుడ్ డ్యాన్సర్లకు ఆర్థిక సాయం అందించాలని ఈసారి నిర్ణయించుకున్నారు. పని కోల్పోయిన డ్యాన్సర్ల బ్యాంకు ఖాతాలో కొంత నగదు జమచేశారు. ఏబీసీడీ 2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో డ్యాన్సర్‌గా నటించిన వరుణ్ ధావన్ నిజజీవితంలో డ్యాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయించడాన్ని పలువురు ప్రశంసించారు. చదవండి : ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment