దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభం ఫ్లాట్‌గా మొదలై లాభాలు పుంజుకున్నా.. ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఒక దశలో100పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 22 పాయింట్లు పెరిగి 26,321కువద్ద, నిఫ్టీ 2పాయింట్లు బలపడి 8,113 వద్ద కొన సాగుతున్నాయి. దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల అమ్మకాలకు బ్రేక్ పడకపోవడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉందని విశ్లేషకుల అంచనా. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్ జోరు కొనసాగుతోంది. అలాగే ఆటో, రియల్టీ రంగాలు లాభాల్లో ఉండగా మీడియా షేర్లు నష్టపోతున్నాయి. టాటా పవర్, భెల్, యాక్సిస్, టాటా మోటార్స్, బీవోబీ, గ్రాసిమ్, లుపిన్, భారతీ, గెయిల్ లాభపడుతుండగా, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్, అంబుజా, విప్రో, ఏసీసీ, జీ, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ నష్టాలతో ట్రేడవుతున్నాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి 67.89వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి 35 రూపాయలు బలపడి పది గ్రా. రూ.29.335 వద్ద ఉంది.