ప్రపంచ తొలి బంగారు ఏటీఎం
లండన్: ప్రపంచంలోనే తొలి ఏటిఎం కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ తొలి బంగారు ఏటీఎంగా రూపాంతరం చెందింది. ఈ ఏటీఎం మిషీన్ ఆవర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రపంచంలో తొలి బంగారు ఏటీఎంగా మరోసారి ఘనతను చాటుకుంది.
ప్రతిష్టాత్మక తన తొలి ఏటీఏం కేంద్రాన్ని 50వ వార్షికోత్సవం సందర్భంగా బంగారు ఏటీఎంగా మార్చింది. దీంతోపాటు స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడ ఉంచడం విశేషం. 1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. అనంతరం ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. కాగా బ్రిటీష్ టీవీ కామెడీ షో "ఆన్ ది బసెస్" లో నటించిన హాలీవుడ్ రెగ్ వార్నీ నగదును ఉపసంహరించుకున్న మొట్టమొదటి వ్యక్తి.
2016 నాటికి బార్క్‌లే బ్యాంక్ కు చెందిన ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల నగదు యంత్రాలు ఉండగా, ఒక్క బ్రిటన్‌లోనే 70వేల ఏటీఏం సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టు అంచనా. దాదాపు175 బిలియన్ పౌండ్లను పంపిణీ చేసింది. ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్, కార్డుల చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ చాలామంది ప్రజల రోజువారీ జీవితంలో నగదు చాలా కీలకమైనదని కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ చానెల్స్ అధిపతి రహేల్ అహ్మద్ చెప్పారు.