ప్రతీకాత్మక చిత్రం
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): అతివేగంతో వస్తున్న ఆటో బస్సును రాసుకుంటూ వెళ్లిపోవడంతో ఓ ప్రయాణికురాలి చేయి తెగి పడిపోయిన సంఘటన వీరఘట్టంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి శనివారం ఉదయం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు త్రీ స్టాప్ బస్సులో వచ్చింది.
చదవండి: ఎస్‌ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే!
అక్కడ నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉండే మూడో సీట్‌లో విండో పక్కన కూర్చుంది. బస్సు వీరఘట్టం వట్టిగెడ్డ వంతెన దాటిన తర్వాత పైడితల్లి చేయిని బయటకు పెట్టి నిద్రలోకి జారుకుంది. అక్కడకు కొద్దిసేపటికి బస్సు జిల్లా పరిషత్ హైసూ్కల్‌కు చేరుకునే సరికి ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటో.. బస్సును రాసుకుంటూ పోవడంతో ఆటో పైనుండే రాడ్ తగిలి పైడితల్లి చేయి తెగి పడిపోయింది. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో బస్సుని నిలిపివేశా రు. సహచర ప్రయాణికులు బాధితురాలిని వీరఘట్టం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment