
ప్రతీకాత్మక చిత్రం
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): ఉదయం అమ్మ చేతి గోరుముద్దలు తిని స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు.. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ భయానక దృశ్యాన్ని చూసిన చిన్నారుల గొంతు మూగబోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర శంకరమ్మ(45) మంగళవారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
చదవండి: బీటెక్ ఫెయిలవ్వడంతో.. ఉప్పుటేరులో దూకి..
వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర పారయ్య, కొమరాడకు చెందిన శంకరమ్మకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పారయ్యకు రెండో వివాహం. పారయ్య, శంకరమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు హరికృష్ణ, ధనుష్‌లు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన పారయ్య, భార్య శంకరమ్మతో అన్యోన్యంగా ఉండేవాడు. అయితే మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో గానీ గ్రామసమీపంలో ఉన్న గొర్రెల మందను కాసేందుకు భర్త వెళ్లగా, భార్య శంకరమ్మ ఇద్దరు పిల్లలకు భోజనం పెట్టి ఊళ్లో ఉన్న స్కూల్‌కు పంపించింది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ఎం.హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment