surgeons
-
హైదరాబాద్‌లో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25 శాతం మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు. నగరంలోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు దీనికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్లైన్లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఇప్పటికి దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్టర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు. -
మహిళా సర్జన్లకు అవకాశమిస్తే బెదిరింపులొచ్చాయి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సర్జన్లుగా మహిళలకు అవకాశం ఇచ్చి నందుకు తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ–మెయిల్స్, లేఖల రూపంలో అవి వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) బుధవారం ‘షీ ట్రంప్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్’(స్త్రీ) పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తల్లి, భార్య, కుమార్తె నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఏఐజీలో పని చేస్తున్న వారిలో 60 శాతం మంది మహిళా ఉద్యోగులే. చాయ్, సిగరెట్, గాసిప్స్ వంటివి ఉండని కారణంగా మహిళా ఉద్యోగుల వల్ల ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఎన్నో పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయగలరు. మెడికల్ కాలేజీల్లో మహిళల సంఖ్య 60 శాతం ఉంటే.. పీజీకి వచ్చేసరికి 10 నుంచి 20 శాతానికి పడిపోతోంది. యూరప్, అమెరికా దేశాల్లోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ల్లో సగం మంది మహిళలే. మన దేశంలో 300 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటే... ఐదుగురే సర్జన్లుగా పనిచేసేవారు. ఈ పరిస్థితులను మార్చడానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ మహిళా సర్జన్లను ఏఐజీకి పిలిపించి గతంలో ఓ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ స్ఫూర్తితో దేశంలోని 100 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు సర్జరీలు చేయడం ప్రారంభించారు. వీరిని ప్రోత్సహిస్తున్నందుకు 10 మంది నుంచి బెదిరింపులు వచ్చాయి. సాధారణ ప్రసవం, తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలలవరకు ఎలాంటి యాంటీ బయాటిక్స్ వాడకపోవడం వల్ల శిశువులు భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో ఉంటారు. మనం మహిళలకు మద్దతు ఇవ్వడంతో పాటు బాధ్యతల్లో భాగస్వాముల్ని చేయాలి’అని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ ‘కుటుంబ జీవితం–సామాజిక మాధ్యమాలు’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ–హెచ్సీఎస్సీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయన పత్రాన్ని ఆవిష్కరించారు. -
వాట్! చేతిపై 'ముక్కు' పెరగడమా? దాంతో ట్రాన్స్‌ప్లాంట్!
శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోతే ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పరిపాటే. కొన్ని అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడమనేది కాస్త క్రిటికల్. కానీ క్యాన్సర్ కారణంగా ముక్కుని కోల్పోయిన ఒక మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సతో విజయవంతంగా ముక్కుని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. వైద్య ప్రక్రియలోనే ఇదోక అద్భతమైన చికిత్స విధానమనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఒక మహిళ 2013లో నాసిక కుహరం క్యాన్సర్ కారణంగా ముక్కున్ని కోల్పోయింది. దీంతో ఆమె అవయవం లేకుండానే కొన్ని ఏళ్లు గడిపింది. అయితే ఒక సరికొత్త వైద్య విధానం ద్వారా కొత్త ముక్కును పొందగలిగింది. అదీకూడా అమె చేతిపైనే పెరిగిన ముక్కుతో. అదేలా సాధ్యం అని సందేహం తలెత్తుంది కదా. కానీ సాధ్యమే అంటూ చేసి చూపించారు ఫ్రాన్స్ సర్జన్లు. ఈ మేరకు వైద్యులు మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన ముక్కును ఆమె ముంజేయికి అమర్చి పరీక్షిస్తారు. ఏకంగా రెండు నెలలు పాటు వైద్య పరికరంతో కూడిన ముక్కును అలా ఉంచి పెరిగిన తర్వాత ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చేతిలోని రక్తనాళాలు ముఖంలోని రక్త నాళాలతో అనుసంధానం చేసి సర్జరీ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సర్జరీని చేయలేదు. ఇది ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్ వైద్య బృందాల సహకారంతో ఈ సర్జరీని విజయంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. (చదవండి: నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!) -
దేశంలో తొలిసారి: కుక్కకు పేస్‌మేకర్
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్ విజయవంతంగా అమర్చారు. కాకర్ స్పేనియల్ జాతికి చెందిన కుక్క ఖుషి (7.5 ఏళ్లు)కి ఢిల్లీలోని మాక్స్ వెటర్నరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60–120 సార్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ శునకం పరిస్థితి సాధారణంగా ఉందని దాని యజమాని మను మీడియాకు తెలిపారు. -
హిప్ ప్రజర్వేషన్పై సర్జన్లకు అవగాహన సదస్సు
-
ముఖంలో పేలని గ్రెనేడ్.. వైద్యుల ఆ'పరేషన్'
బొగోటా: ప్రమాదవశాత్తూ ఓ సైనికుడి ముఖంలోకి దూసుకెళ్లిన గ్రెనేడ్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కొలంబియాలోని బొగోటాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు పార్కింగ్ స్థలాన్నే మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ థియెటర్గా మార్చారు. గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు ఈ ఆపరేషన్‌ను జాగ్రత్తగా పూర్తి చేసి సైనికుడి ప్రాణాలతో పాటు తమ ప్రాణాలనూ కాపాడుకున్నారు. కొలంబియా సైనికుడి ముఖంలోకి ఆ గ్రెనేడ్ ఎలా దూసుకెళ్లింది అనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మిలిటరీ క్యాంప్‌లో జరిగిన ఓ ప్రమాదంలో గ్రెనేడ్ ముఖంలోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. గ్రెనేడ్‌ను తొలగించడంతో సదరు సైనికుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు. అత్యంత ధైర్యసాహసాలతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. చీఫ్ సర్జన్ విలియం సాంచెజ్ మాట్లాడుతూ..' గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంలో మిగిలిన పేషెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కారు పార్కింగ్ స్థలంలో ఆపరేషన్‌ను నిర్వహించాం. అవి చాలా ఉద్విగ్నమైన క్షణాలు. పేలుడు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం' అని తెలిపారు. -
కట్ అండ్ పేస్ట్
మెడిక్షనరీ ఎక్కువగా మీడియాలో ఉపయోగించే పదబంధం ఇది. కంప్యూటర్లు వచ్చాక బాగా ప్రాచుర్యం పొందింది. సొంత కథనమేదీ రాయకుండా ఎక్కడిదో సమాచారాన్ని యథాతథంగా ఎత్తేసి, కావలసిన చోట అతికించేసే ప్రక్రియను ఇలా అంటారు. వైద్య పరిభాషలోనూ ‘కట్ అండ్ పేస్ట్’ అనే పదబంధాన్ని వాడుతుంటారు. అయితే, వేరే అర్థంలో వాడుతుంటార్లెండి. మిడిమిడి జ్ఞానం గల సర్జన్లు రోగికి ఏమైందో సరిగా తెలుసుకోకుండానే అర్జంట్‌గా ఆపరేషన్ చేసేస్తుంటారు. ఇలాంటి ఆపరేషన్లలో కోత కోసిన తర్వాత రోగికి చేయాల్సిందేమీ లేదని తాపీగా తెలుసుకున్నాక, గుట్టుచప్పుడు కాకుండా కోసినంత మేరా కుట్టేసి, ఆ తర్వాత కోత గాయం తగ్గడానికి మందులు మాకులు ఇస్తారు. ఇలాంటి అనవసరపు ఆపరేషన్లనే ‘కట్ అండ్ పేస్ట్’ అంటారు.