పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది? | Woman left with massive hole in her nose after using herbal treatment she though would cure skin cancer | Sakshi
Sakshi News home page

పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది?

Published Wed, Jun 1 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది?

పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది?

న్యూయార్క్: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లయింది అమెరికాలో ఓ మహిళ పరిస్థితి. తన ముక్కుపై చర్మ క్యాన్సర్ కారణంగా పెరిగిన అకారణ చర్మ బొడిపెను పొగోట్టుకునేందుకు ఆమె 1990నాటి రోజుల్లో ఉపయోగించిన బ్లాక్ సాల్వ్ అనే సహజ సిద్ధమైన పద్ధతిలో తయారుచేసిన ఆయిట్ మెంట్ ను ఉపయోగించడందో ఆమె ముక్కుకు, నుదుటి భాగానికి అతిపెద్ద సమస్య ఏర్పడింది. ఆ హెర్బల్ క్రీమ్ కాస్త ఆమె ముక్కును రివర్స్లో మొత్తం తినేసి నల్లటి పుండుగా మారింది.

అలా మారిన పుండును ఆమె గట్టిగా రుద్ది చూడగా ఏకంగా ముక్కుపై పెద్ద రంధ్రమే పడింది. అది ఎంతపెద్దగా ఉందంటే ప్రస్తుతం ఆమె శ్వాస కూడా ఈ రంధ్రం ద్వారా వెళుతుంది. ఇక నుదురు భాగంలో కూడా నల్లగా కమిలిపోయి చర్మం రాలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఎంతో అందంగా ఉండే ఆమె ముఖంలో ఇలా వికారమైన గాయాలు తయారవడంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయిన ఆమె వెంటనే తన బాధను ఆన్లైన్ లో పంచుకుంది. ఇలాంటి ప్రయోగాలు చేసి తనలా ఎవరూ మారిపోవద్దంటూ బాధపడింది. ఈ వీడియోను, ఫొటోలను ఇప్పటికే లక్షల మంది చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement