ప్రతీకాత్మక చిత్రం
ఫ్లోరిడా : బ్రతికున్న చేప కడుపులో ప్రాణాలతో ఉన్న తాబేలును గుర్తించారు బయోలజిస్టులు. ఈసంఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ బయోలజిస్టులు అక్కడి ఓ చెరువులో లార్జ్‌మౌత్ బాష్ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్‌కు తెచ్చి పరిశోధనకు ఉంచారు. దాని లింగాన్ని కనుగొనే నేపథ్యంలో పొట్టలో ఏదో కదులుతున్నట్లు వారు గుర్తించారు. జాగ్రత్తగా చేప నోటిని తెరిచి చూడగా ఓ బ్రతికున్న తాబేలు కనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీసి చెరువులో వదిలేశారు.
లార్జ్‌మౌత్ బాష్ చేప కడుపులో బ్రతికున్న తాబేలును గుర్తించటం సాధారణంగా జరగదని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ పెద్ద నోటి చేప గట్టిగా ఉన్న తాబేలు పైచిప్పను ఎలా నమలగలననుకుంది’’.. ‘‘ తాబేలుకు భూమ్మీద నూకలున్నాయి’’.. ‘‘ బ్రతికున్న చేప కడుపులో తాబేలు బ్రతికుండటం.. ఓ అద్భుతం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment