ఏదో బాడీ బిల్డర్ పోటీల్లో తాబేలు తన కండలు చూపిస్తున్నట్టుంది గదా ఫొటో చూస్తుంటే. ఎదురుగా ఉన్నవాళ్లు భయపడిపోయేలా కోపంగా చూస్తోంది కదా. ఇదో గ్రీన్ సీ టర్టల్. గాలపగోస్‌లో ట్రిప్‌లో ఉండగా ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ డానియెలె కొమిన్ దీని ఫొటో తీశారు.
‘సముద్రంలోకి హామర్‌హెడ్స్ షార్క్‌ల ఫొటోలు తీయడానికని కొమిన్ బయలుదేరా. అది మిట్టమధ్యాహ్నం సమయం. కెమెరా సెట్ చేసుకుని డైవ్ చేశా. ఆ నీళ్లు పచ్చగా ఉన్నాయి. వెలుతురు సరిగా లేదు. సరైన ఫొటోల కోసం కెమెరాను సరి చేయడానికి చాలా సమయం పట్టింది’ అని తన కష్టాన్ని వివరించారు ఫొటోగ్రాఫర్.
Comments
Please login to add a commentAdd a comment