Artemis 1: Nasa Postponed Due To Malfunctioning Engine - Sakshi
Sakshi News home page

ఆర్టెమిస్‌ 1 ఆగింది.. ప్రయోగం ముందర సాంకేతిక సమస్య.. నిలిపివేసిన నాసా

Published Mon, Aug 29 2022 6:17 PM | Last Updated on Mon, Aug 29 2022 7:21 PM

Artemis 1: Nasa postponed due to malfunctioning engine - Sakshi

తల్లాహస్సీ:  నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. 

ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్‌లు ఇంజిన్‌లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్‌ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్‌ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా.

ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంట‌ర్ నాసా స్పేస్ లాంచ్ సిస్ట‌మ్‌(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంట‌ర్ నుంచి  ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. 

శాశ్వత ఆవాసాల కోసం.. 
దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా..  ఆర్టెమిస్‌-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.

ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement