రోహిత్ శర్మ(PC: BCCI)
India Vs West Indies T20 Series: టీమిండియా అభిమానులకు శుభవార్త! కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా విండీస్‌తో మూడో టీ20 సందర్భంగా రోహిత్ శర్మ.. వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హిట్‌మ్యాన్‌కు వీపు కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రోహిత్ క్రీజును వీడాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఖరి రెండు టీ20 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదోనన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
కాగా మంగళవారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నాలుగో టీ20కి సమయం ఉన్నందున అప్పటి పరిస్థితిని బట్టి తాను మైదానంలో దిగుతానో లేదోనన్న విషయం తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం హిట్‌మ్యాన్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రిక్‌బజ్.. ‘‘శని, ఆదివారాల్లో జరిగే ఆఖరి రెండు మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు’’ అని తన కథనంలో పేర్కొంది.
వీసా సమస్య తొలగింది!
ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి రెండు టీ20లు జరుగనున్నాయి. అయితే, ఇరు జట్ల ఆటగాళ్లు అమెరికాకు చేరే క్రమంలో వీసా సమస్యలు ఎదురుకాగా.. గయానా అధ్యక్షుడు చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విండీస్, భారత్ ఆటగాళ్లు ఫ్లోరిడా చేరుకోనున్నట్లు సమాచారం.
కాగా శని(ఆగష్టు 6), ఆది(ఆగష్టు 7) వారాల్లో నాలుగో, ఐదో టీ20 జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్ వేదికగా సాగిన వన్డే సిరీస్‌లో ధావన్ సేన 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ బృందం ఫ్లోరిడా మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
చదవండి: SA vs IRE T20: ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఓడినా ఆకట్టుకుంది
Comments
Please login to add a commentAdd a comment