యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి | Florida Cat Gifted Two Head Snake To His Owner In USA | Sakshi
Sakshi News home page

రెండు తలల పామును బహుమతిగా ఇచ్చిన పిల్లి

Published Sat, Oct 24 2020 2:33 PM | Last Updated on Sat, Oct 24 2020 3:50 PM

Florida Cat Gifted Two Head Snake To His Owner In USA - Sakshi

తల్లాహస్సీ‌: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. సరదాగా బయట తిరగడానికి వెళ్లిన ఓ పెంపుడు పెల్లి అరుదైన రెండు తలల పామును యాజామానికి కానుక ఇచ్చి అబ్బురపరించింది. ఫ్లోరిడాలో శనివారం వెలుగు చూసిన ఈ రెండు తలల పాము పేరు బైస్‌ఫాలీ. ప్రస్తుతం ఈ పాము సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాలు... అమెరికాలోని రోజర్స్‌ అనే మహిళా పెంపుడు పిల్లి బయటకు వెళ్లిన ప్రతిసారి యజమానికి బయట నుంచి ఎదోక బహుమతి తీసుకువెళుతుంది. అయితే అది ఈసారి పామును తీసుకువచ్చి నేరుగా హాల్‌లోని కార్పెట్‌పై ఉంచడంతో వారంత ఆశ్చర్యపోయారు. అయితే ఆ పాము రెండు తలలతో వింతగా ఉండటం వారు బయపడకుండా దానిని పెంచుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్లాస్టిక్‌ కంటైనర్ దానిని బంధించి సరిసృపాల నిపుణులను సంప్రదించారు. (చదవండి: ఈ చిన్న జీవి బలం ఎంతో తెలుసా?)

దీనిని బైస్‌ఫాలీ అని పిలిచే ఈ రెండు తలల పాము జన్యులోపం వల్ల జన్మించినట్లు నిపుణులు వెల్లడించారు. అయితే ఇది పిండం అభివృద్ధి సమయంలో రెండు మోనో జైగోటిక్ కవలలు వేరు చేయడంలో విఫలమై తలలు ఒకే శరీరంలో కలిసిపోవడం ఈపాము రెండు తలలతో పుట్టినట్లు తెలిపారు. కానీ ఇది అడవిలో జీవించే అవశాకం లేదని, ఇది ఆహారం కూడా సరిగా తీసుకోలేదన్నారు. ఎందుకంటే ఒక తల ఆహారాన్ని చూసి దాని వైపు కదులుతుండగా రెండో తల మరోవైపుకు లాగడం వల్ల ఆహారాన్ని తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ రెండు తలల పామును ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్(ఎఫ్‌డబ్ల్యూసీ) వారు పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: సోషల్‌ మీడియా జోరు- యూఎస్‌ వీక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement