sneak
-
ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి..
అమెరికాలోని ఓ మహిళ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కింది. ‘న్యూయార్క్ పోస్ట్’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 7న నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది. -
యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి
తల్లాహస్సీ: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. సరదాగా బయట తిరగడానికి వెళ్లిన ఓ పెంపుడు పెల్లి అరుదైన రెండు తలల పామును యాజామానికి కానుక ఇచ్చి అబ్బురపరించింది. ఫ్లోరిడాలో శనివారం వెలుగు చూసిన ఈ రెండు తలల పాము పేరు బైస్ఫాలీ. ప్రస్తుతం ఈ పాము సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాలు... అమెరికాలోని రోజర్స్ అనే మహిళా పెంపుడు పిల్లి బయటకు వెళ్లిన ప్రతిసారి యజమానికి బయట నుంచి ఎదోక బహుమతి తీసుకువెళుతుంది. అయితే అది ఈసారి పామును తీసుకువచ్చి నేరుగా హాల్లోని కార్పెట్‌పై ఉంచడంతో వారంత ఆశ్చర్యపోయారు. అయితే ఆ పాము రెండు తలలతో వింతగా ఉండటం వారు బయపడకుండా దానిని పెంచుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్లాస్టిక్ కంటైనర్ దానిని బంధించి సరిసృపాల నిపుణులను సంప్రదించారు. (చదవండి: ఈ చిన్న జీవి బలం ఎంతో తెలుసా?) దీనిని బైస్ఫాలీ అని పిలిచే ఈ రెండు తలల పాము జన్యులోపం వల్ల జన్మించినట్లు నిపుణులు వెల్లడించారు. అయితే ఇది పిండం అభివృద్ధి సమయంలో రెండు మోనో జైగోటిక్ కవలలు వేరు చేయడంలో విఫలమై తలలు ఒకే శరీరంలో కలిసిపోవడం ఈపాము రెండు తలలతో పుట్టినట్లు తెలిపారు. కానీ ఇది అడవిలో జీవించే అవశాకం లేదని, ఇది ఆహారం కూడా సరిగా తీసుకోలేదన్నారు. ఎందుకంటే ఒక తల ఆహారాన్ని చూసి దాని వైపు కదులుతుండగా రెండో తల మరోవైపుకు లాగడం వల్ల ఆహారాన్ని తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ రెండు తలల పామును ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్(ఎఫ్‌డబ్ల్యూసీ) వారు పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: సోషల్ మీడియా జోరు- యూఎస్ వీక్) -
ఆ పాము ఖరీదు రూ.1.25 కోట్లు!
భోపాల్: అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న ఓ విషరహిత పామును మధ్యప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ1.25 కోట్లు విలువ చేసే అరుదైన జాతికి చెందిన రెండు తలల పామును మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌ఘర్‌లో అయిదుగురు సభ్యుల ముఠా అదివారం విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. అంతర్జాతీయిమార్కెట్లో భారీ ఎత్తున డిమాండ్ పలికే ఈ పాము పేరు ‘రెడ్ సాండ్ బో’. అయితే ఇది విషరహిత సర్పం. దీనిని నార్సింగ్‌ఘర్ బస్‌స్టాండ్ వద్ద విక్రయించేందుకు సెల్ఫోన్లో డీల్ మాట్లాడుతుండగా స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ అరుదైన రెడ్ సాండ్ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్స్ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఉపయోగించే అత్యంత అరుదైన ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ కూడా ఉంది. ఈ పాము ధర వందలూ, వేలూ కాదు...లక్షలు, కోట్లు పెడితే తప్ప దీనిని సొంతం చేసుకోలేరు. అలాగే దీనిని ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని కొంతమంది నమ్మకం. అంతటి ఖరీదు ఉన్న ఈ పామును నిందితులు షేహోర్ జిల్లాలోని అటవి ప్రాంతంలో పట్టుకుని రూ.1.25 కోట్లకు విక్రయించడానికి తీసుకువచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో వారిపై అదనంగా వన్యప్రాణి రక్షణ చట్టం కింద మరో కేసును నమోదు చేసినట్లు పోలీసు అధికారి కైలాస్ భరద్వాజ్ మీడియాకు తెలిపారు. -
రాజధానిలో పాక్ ఉగ్రవాదులు? హై అలర్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ గురుదాస్ పూర్ బీభత్సాన్ని పాక్ ఉగ్రవాదులు ఇంకా కొనసాగించనున్నారా? దేశంలో మరింత బీభత్సాన్ని సృష్టించేందుకు పథక రచన చేస్తున్నారా? ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ నగరంలో మాటు వేసి వున్నారా? ఆగస్టు 15 సందర్భంగా భీకర దాడులతో విరుచుకుపడనున్నారా? నిఘా వర్గాల తాజా హెచ్చరికలను చూస్తోంటే...అవుననే అనిపిస్తోంది. పాకిస్తానీ ఉగ్రవాదులు ఇప్పటికే నగరంలో తిష్టవేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తొమ్మిదిమంది అనుమానిత ఉగ్రవాదులు భారీపేలుడు పదార్థాలు సహా నగరంలోకి చొరబడ్డట్టు సమాచారం. పెద్ద ఎత్తున డిటొనేటర్ల, ఆర్డీక్స్ లాంటి భారీ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి పథక రచన చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో హై ఎలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. పంజాబ్ గురుదాస్ పూర్ ఉగ్రదాడి తరువాత ఇంటిలిజెన్స్ వర్గాల మరింత అప్రమత్తమ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ఉగ్రవాదులు దేశంలో బీభత్సాన్ని సృప్టించేందుకు సిద్ధమవుతున్నట్టు గుర్తించాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 దేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా టెర్రరిస్టులు ఎటాక్ చేసే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాయి. దాదాపు మూడు నెలల క్రితమే భారీ ఎత్తున ఆయుధాలతో నగరంలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాల సమాచారం.