
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్ తాజా స్పేస్‌ఎక్స్‌తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్‌వెబ్ సీఈవో నీల్ మాస్టర్‌సన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment