Shocking: Florida Woman Find Huge Amount In Her Account, See What Happened Next - Sakshi
Sakshi News home page

మహిళకు భారీ షాక్‌.. అకౌంట్‌లో ఏకంగా రూ.7400 కోట్లు!

Published Wed, Jun 23 2021 11:10 AM | Last Updated on Thu, Jun 24 2021 6:21 PM

Woman Shocked To Find 1 Billion Dollars In Her Bank Account - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే.. ఎలా ఉంటుంది.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ సంతోషంలో నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్‌లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్‌ కిందకు వస్తుందని మెసేజ్‌ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు.

సదరు మహిళ అసలు తన బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉందో చెక్‌ చేయగా.. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్‌ డాలర్లు(7400 కోట్ల రూపాయలు) ఉన్నట్లు చూపింది. ఇది చూసి ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పగా.. వారు కూడా చెక్‌ చేశారు. ఆమె అకౌంట్‌లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్‌లో నెగిటివ్‌ బిలియన్‌ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్‌ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు. ఫలితంగా సదరు మహిళ 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయింది అని వివరించారు.

చదవండి: ఆన్‌లైన్ క్లాసుల‌ని ఫోన్ ఇస్తే ఏకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement