సీసాలో సందేశం.. చివరకు ఏమైందంటే | How Message In Bottle Makes Friendship Between Girls In America | Sakshi
Sakshi News home page

సీసాలో సందేశం.. చివరకు ఏమైందంటే

Published Sun, Jun 28 2020 1:21 PM | Last Updated on Sun, Jun 28 2020 1:52 PM

How Message In Bottle Makes Friendship Between Girls In America - Sakshi

న్యూయార్క్‌ : సీసా సందేశం అనే మాట ఇప్పట్లో వాడుకలో లేదు కాని రాజుల కాలంలో చాలా ఫేమస్‌ అనే చెప్పొచ్చు. యుద్దాల్లో పాల్గొనడానికి సముద్ర మార్గంలో ప్రయాణించినప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు తమను కాపాడమనో లేక తమ గురించి చరిత్ర తెలుసుకోవాలనో సీసాల్లో సందేశాలు పెట్టి సముద్రంలోకి విసిరేవారు. అలా అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడో ఒకచోట ఒడ్డుకు చేరేవి. ఇప్పుడు అలాంటివి మనం సినిమాల్లో చూస్తున్నాం తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా అమెరికాలో మాత్రం సీసా సందేశం అసలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులను స్నేహితులుగా మార్చింది.(నాసా టాయిలెట్‌ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు)

వివరాలు.. 11 ఏళ్ల వయసున్న సోఫియా, సారా బెత్‌లు అమెరికాలో ఉంటున్నారు. వాళ్లిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. అయితే న్యూయార్క్‌కి చెందిన సోఫియా సెలవుల్లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్‌డేల్‌కి వెళ్లింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా వ్యాధి విజృంభిస్తోంది. దాంతో సెలవులకని వెళ్లిన సోఫియా  అక్కడే ఉండాల్సి వచ్చింది.  అక్కడికి దగ్గరలోని సముద్రంకు వెళ్లిన సోఫియా సరదాగా ఒక చీటిని రాసి బాటిల్‌లో పెట్టి విసిరేసింది. తన పేరు సోఫియా అని.. కరోనా వల్ల ఇక్కడే చిక్కుకుపోయానని.. తనకు కరోనా అస్సలు నచ్చలేదని.. స్కూల్‌ ఫ్రెండ్స్‌ని మిస్సవుతున్నానని చీటిలో తెలిపింది. ఏదో సరదాగా చేసిన సోఫియాకు దాని నుంచి రిప్లై వస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు.

సోఫియా విసిరేసిన ఆ బాటిల్ దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. చివరకు ఉత్తర కరోలినాలోని హాల్డెన్ బీచ్‌కి చేరింది. అక్కడ ఆ బాటిల్ సారా బెత్‌కి కనిపించింది. సీసాలో ఏదో ఉండడం గమనించిన సారా బాటిల్‌ మూత తీసి చీటిని బయటకు తీసింది. ముందు అదేదో చెత్త పేపర్‌ అని భావించిన సారా దాన్ని పడేయాలనుకుంది. అయితే ఒకసారి చదివితే పోలా అని చీటిని ఓపెన్‌ చేసింది. చీటీలో ఉన్న సందేశాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తాను ఎక్కడున్నదీ ఆ పేపర్‌లో సోఫియా చెప్పడంతో సారాబెత్ ఆమెతో మాట్లాడింది. కరోనా తగ్గిపోతుందనీ... బోర్‌గా ఫీల్ అవ్వొద్దని ధైర్యం చెప్పింది. అలా సీసా సందేశం ముఖ పరిచయం కూడా లేని సోఫియా, సారాబెత్‌ను స్నేహితులుగా మార్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా తగ్గగానే సోఫియా, సారాలు కలవాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తున్న వేళ ఇలా సీసాలో సందేశం పంపడం, దానికి అటు నుంచి రిప్లై రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement