తలలో బుల్లెట్తో ఫేస్బుక్లో వీడియో! | Rapper gets 'shot in the head', immediately posts video on Facebook | Sakshi
Sakshi News home page

తలలో బుల్లెట్తో ఫేస్బుక్లో వీడియో!

Published Tue, Oct 13 2015 3:26 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

తలలో బుల్లెట్తో ఫేస్బుక్లో వీడియో! - Sakshi

తలలో బుల్లెట్తో ఫేస్బుక్లో వీడియో!

ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు చూస్తుంటాం. ఎంతోమంది యూజర్లు తమ నిత్యజీవితంలో జరిగిన సంఘటనల తాలుకు పోస్టులు, ఫొటోలు, వీడియోలు పెడుతారు. అదేవిధంగా  ఓ వ్యక్తి తన తలలో బుల్లెట్ దిగి.. రక్తం చిందుతున్న వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి.. ఒకింత భయభ్రాంతులకు గురిచేశాడు.
 
అమెరికా కాలిఫోర్నియాలోని కాంప్టన్ నగరానికి చెందిన  ర్యాపర్ తెరిక్ రాయల్ అనే యువకుడు తన తలలోకి ఏకే 47 బుల్లెట్లు దూసుకుపోయాయంటూ.. రక్తం చిందుతున్న తన ముఖం దృశ్యాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. 'దేవుడా.. ఈ ఏకే 47 తూటాల నుంచి నన్ను, నా సోదరుడిని తప్పించు. ఆ దేవుడి దయవల్లే నేను మరో రోజు చూడగలుగుతున్నాను.
 
దీని గురించి పాడగలుగుతున్నాను' అని అంటూ ఈ వీడియో గురించి రాశాడు. ఆ వీడియోలో పెట్రోల్ బంకు సమీపంలో తొక్కిసలాట జరిగినట్టు కనిపిస్తున్నది. వీడియోలో ర్యాపర్ 'ఇప్పుడే నన్ను తుపాకీతో కాల్చేశారు' అని పేర్కొంటూ కనిపించాడు. తనకు బుల్లెట్ దిగినప్పటికీ, తీవ్రగాయం కాకుండా ఎలా తప్పిపోయిందో తెలియజేస్తూ ఓ ఎక్స్రేను కూడా అతను తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement