Gully Boy Fame Rapper MC Tod Fod Dies At Age 24 This Is The Last Video: బాలీవుడ్ ర్యాపర్ ధర్మేష్ పర్మార్ అకాల మరణం చెందాడు. ఎంసీ టాడ్ ఫాడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న ధర్మేష్ 24 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే ఎంసీ టాడ్ ఫాడ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గల్లీ బాయ్'లో ఇండియా 91 ట్రాక్ కోసం ర్యాప్ చేశాడు ధర్మేష్. ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని అకాల మరణం పట్ల చింతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ బాయ్ మూవీలో నటించిన రణ్‌వీర్ సింగ్, సిద్ధాంత్ చతుర్వేది ర్యాపర్ దర్మేష్ పర్మార్‌కు నివాళులు అర్పించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ర్యాపర్ టాడ్ ఫాడ్ ఫొటో షేర్ చేస్తూ హార్ట్ బ్రోకెన్ ఎమోజీని యాడ్ చేశాడు రణ్‌వీర్ సింగ్. అలాగే ర్యాపర్‌తో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ 'రెస్ట్ ఇన్ పీస్ భాయ్' అని రాసుకొచ్చాడు సిద్ధాంత్ చతుర్వేది. 'మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు. మన మార్గాలు వేరయ్యాయి. కానీ మీరు చేసినదానికి కృతజ్ఞతతో ఉండగలను. రెస్ట్ ఇన్ పీస్ బంటాయి.' అని గల్లీ బాయ్ మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ పోస్ట్ చేశారు. జోయా అక్తర్ నిర్మాణ సంస్థ టైగర్ బేబీ ఫిల్మ్స్ నివాళులు తెలిపింది.
ఎంసీ టాడ్ ఫాడ్ సభ్యుడిగా ఉన్న 'స్వదేశీ బ్యాండ్' తన అధికార పేజీలో అతని త్రోబ్యాక్ ప్రదర్శన వీడియోను షేర్ చేసింది. 'ఈ రాత్రే టాడ్ ఫాడ్ స్వదేశీ మేళాలో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. అతని లైవ్ మ్యూజిక్ థ్రిల్, ప్యాషన్‌ను అనుభూతి చెందాలంటే మీరు అక్కడ ఉండాల్సింది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఎల్లప్పుడూ మీ సంగీతంతో జీవిస్తారు.' అంటూ రాసుకొచ్చింది స్వదేశీ బ్యాండ్.
Comments
Please login to add a commentAdd a comment